Sunday, October 11, 2026
[t4b-ticker]

బాప్టిస్ట్ చర్చ్ లో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు.

బాప్టిస్ట్ చర్చ్ లో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ కాపరి, కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ ఒంటెపాక యేసయ్య, కోదాడ మున్సిపాలిటీ మాజీ క్రిస్టియన్ కో-ఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి యేసయ్యని సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సంఘ కాపరి సంఘస్తుల ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నిరంతరం ప్రార్థించేవారని, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు నిత్యం శ్రమిస్తూ సంఘాన్ని నిర్మించి సమాజంలో ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దే గొప్ప సేవకుడని కొనియాడారు. అంతేకాకుండా, తమకు ఎదురయ్యే కష్టనష్టాలను, వ్యతిరేకతలను, ప్రతికూల పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ సంఘాన్ని ముందుకు నడిపించే గొప్ప యోధుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం మాజీ ఎంపీపీ యాతాకుల జ్యోతి మధు బాబు, సంఘ పెద్దలు బోలికొండ కోటయ్య, జాన్, జగ్గు నాయక్, మోజస్, రాంబాబు, గురునాథ్, విజయ్, ఏనుష్, స్రవంతి, శార, అరుణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular