Friday, September 25, 2026
[t4b-ticker]

కనుల పండుగగా తమ్మర గణనాధుని శోభాయాత్ర

కనుల పండుగగా తమ్మర గణనాధుని శోభాయాత్ర

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 25( ప్రతినిధి మాతంగి సురేష్): మున్సిపల్ పరిధిలోని 04వ వార్డు లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తమ్మర లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజలందుకొని శుక్రవారం కనుల పండుగగా వేదమంత్రాలతో శోభాయాత్రకు బయలుదేరిన గణనాధుని వాహనం శోభాయాత్రకలో భాగంగా జరిగిన ఊరే గుంపులో గణపతి బొప్పా మోరియా నినాదాలతో కోదాడ పట్టణం దద్దరిల్లింది. భక్తిశ్రద్దలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గణనాథుల దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణపయ్య ఊరేగింపుకు ముందు డీజే సంగీతాల నడుమ ఊరేగింపులు సాగాయి. తీన్మార్ డీజేలకు యువత ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ సందడి పలువురిని ఆకట్టుకున్నాయి. యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు భక్తులు ప్రత్యేక దుస్తులు ధరించి గణనాథుడి ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలుచోట్ల బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకోవడంతో పట్టణ ప్రధాన వీధులు సందడిగా మారాయి. శోభాయాత్రలో యూత్ సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular