స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచి గోసుల రాజేష్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి మా గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా రేషన్ కార్డు లేక ఎన్నో సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించిన ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేనని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మంత్రి, ఎమ్మెల్యే కు సర్పంచి, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, డీలర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



