Sunday, August 2, 2026
[t4b-ticker]

కారు యూనియన్ సర్పంచిగా బానోతు శంకర్ నాయక్ ఘన విజయం

కారు యూనియన్ సర్పంచిగా బానోతు శంకర్ నాయక్ ఘన విజయం

:కోదాడ పట్టణంలోని సాయి గార్డెన్‌లో ఉత్కంఠగా ఎన్నికలు.

:ప్రత్యర్థిపై 130 ఓట్ల మెజారిటీతో విజయం.

:యూనియన్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని విజేత హామీ.

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 02(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని సాయి గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన కారు యూనియన్ సర్పంచి ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఎన్నికల్లో బానోతు శంకర్ నాయక్ సభ్యుల విశ్వాసాన్ని చూరగొని ప్రత్యర్థిపై 130 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే యూనియన్ సభ్యులు, ఆయన అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు వేసి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. విజయం అనంతరం బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి యూనియన్ సభ్యుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనది కాదని, యూనియన్ సభ్యులందరిదేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సభ్యులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. యూనియన్‌కు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానన్నారు. డ్రైవర్లు, వాహన యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంక్షేమ అంశాలు, యూనియన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంపై సభ్యులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. సభ్యులందరినీ కలుపుకొని పారదర్శకంగా యూనియన్‌ను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున ఆయనను అభినందించగా, రాబోయే రోజుల్లో యూనియన్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular