స్మార్ట్ రేషన్ కార్డులు పేద ప్రజల ఆకలి తీర్చే ఆత్మగౌరవం
:సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
:మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో వార్డుని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా
: 19 వార్డ్ కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి
Mbmtelugunews// కోదాడ, సెప్టెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు పేద ప్రజల ఆకలి తీర్చే ఆత్మగౌరవం, ఏ రాష్ట్రంలో ఇవ్వని సన్నబియ్యం మంత్రి ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాడని19 వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 19 వ వార్డు భవానీ నగర్లో 24వ డీలర్ షాపులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డ్ కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి పాల్గొని రేషన్ డీలర్ కాంపాటి సునీత వీరబాబు తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో లబ్ధిదారులకు కాగిత రూపంలో రేషన్ కార్డులు అందజేశారని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వాటి స్థానంలో ఆధ్యాదునిక క్యూఆర్ కోడ్ మరియు పివిసి ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. మహాలక్ష్మి స్మార్ట్ కార్డు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార కార్డు చూపించవలసి ఉంటుందని కానీ రేషన్ షాపులలో ఏ అవసరం లేకుండా స్మార్ట్ కార్డు చూపెడితే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందజేస్తుందని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం నిత్యవసర సరుకలకు మాత్రమే కాకుండా ప్రభుత్వం అందించే పలు సమక్షేమ పథకాల కూడా కీలక ఆధారంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో రేషన్ కార్డుల కంటే ఇప్పుడు 250 రేషన్ కార్డులు పెరగడంతో 24 నెంబర్ రేషన్ షాపు నందు 965 కార్డులు లబ్ధిదారులు రేషన్ పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సమక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమములు డిసి వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తమ్మనబోయిన వీరబాబు, మారేల్లి వెంకటరెడ్డి, కొనకంచి నాగేశ్వరరావు, లంకెల కుటుంబ రెడ్డి, పంతంగి నారాయణ, తూములూరు సీతారామరాజు, టీ నాగేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.



