శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి
:మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ బాణాల కవిత నాగరాజు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్) : నేడు యావత్ తెలంగాణ సమాజంతో పాటు ముఖ్యంగా దళిత సమాజం బాధతో అసెంబ్లీ వైపు చూస్తోందని అన్నారు. గత పది సంవత్సరాల పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గతంలో భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయనను అవమానించారని గుర్తు చేశారు.ప్రస్తుతం ఒక కుట్ర ప్రకారమే గౌరవ స్పీకర్‌ను అవమానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తాతా మధు వరకు పలువురు నాయకులు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వైఖరి అద్ధంపడుతుందని అన్నారు. అంతేకాకుండా మహిళా రక్షకభటుల విషయంలో కూడా వారు చేసినటువంటి అనుచరించినటువంటి విధానం అత్యంత జగిత్సాకరంగా ఉంది దీనిపై తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. స్పీకర్‌పై చేస్తున్న దుర్భాషలు చూస్తుంటే మనసు కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, స్పీకర్‌ను అవమానించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని దోషులుగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రారని, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులైన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందని తెలిపారు. ప్రజల ఆస్తులు, భూములు, ఇసుకతో పాటు మనుషుల జీవితాలను కూడా గత పాలనలో దోచుకున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మీడియా సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ బాణాల కవిత నాగరాజు, మాజీ వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు.



