వనమావత్వంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
:ప్రతి ఒక్క ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి.
: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం,జులై 30(ప్రతినిధి మాతంగి సురేష్):వనమావత్వంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచి గోసుల రాజేష్ అన్నారు. నడిగూడెం మండల పరిధిలోని కేశవపురం గ్రామ పంచాయతీ నందు వన మహోత్సవం కార్యక్రమను, జలసిరి (వ్యక్తి గత ఇంకుడు గుంత )పనులను సర్పంచి గోసుల రాజేష్ రావి చెరువు కట్ట మీద ఖార్జురా మొక్కలు నాటి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వనం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటి నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. అదేవిధంగా వాతావరణమే దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసి భూగర్భ జలాలను పెంచాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం నందు ఎక్సైజ్ ఎస్సై యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ భవానిలక్ష్మి ప్రసన్న, జలసిరి పనులను మండలం పంచాయతీ అధికారి ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి సురేష్, గౌడ సంఘ అధ్యక్షులు గోసుల నర్సయ్య, గౌడ సంఘ పెద్దలు శీలం వీరయ్య , గ్రామ పెద్దలు గుజ్జర్ల పూడి అర్జున్ రావు, వార్డు సభ్యులు పచ్చిగోళ్ళ స్వరూప, పప్పుల ఉపేందర్, చల్ల సత్యనారాయణ, మిర్యాల ఉపేందర్, వికసిత్ భారత్ గ్యారంటీ (విబిజిరామ్ పథకం ) రోజ్ గార్ సేవక్, డి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
Untuk informasi lebih lanjut tentang toto slot online, Anda dapat merujuk pada Slot Toto Online



