Friday, September 11, 2026
[t4b-ticker]

పొలంలో మోకాళ్ళ పై కూర్చుని దండం పెడుతూ వినూతన నిరసన తెలుపుతన్న రైతులు

పొలంలో మోకాళ్ళ పై కూర్చుని దండం పెడుతూ వినూతన నిరసన తెలుపుతన్న రైతులు

:కరెంటు కట్ నీళ్ళు పట్

: లబ్బోదిబ్బోముంటున్న రైతులు

: తక్షణమే నీటిని విడుదల చేసి నాణమైన కరెంటు అందించాలి

: గొండ్రియాల ఉప సర్పంచి బండ్ల రమేష్

Mbmtelugunews// అనంతగిరి, సెప్టెంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్ ) కొత్తగూడెం మేజర్ కాలువకు నీటిని విడుదల చేసి నాణమైన కరెంటు అందించాలని గొండ్రియల ఉపసర్పంచి బండ్ల రమేష్ అన్నారు. అనంతరం ఎండిపోతున్న పొలంలో మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడుతూ వినూతనమైన నిరసన తెలుపుతున్న రైతులు. అనంతరం బండ్ల రమేష్ మాట్లాడుతూ ముత్యాల బ్రాంచ్ కెనాలకు గత 15 రోజుల నుంచి నీళ్లు పోతున్నాయి కానీ కొత్తగూడెం మేజర్ కాలువకు నీళ్లు ఇవ్వకపోవడం ఈ కాల్వ కింద ఉన్న రైతులు ఏం పాపం చేశారు అని అన్నారు. ఇప్పటివరకు ఎకరాకు 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నామని అవి ఎండిపోతే మా పని అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు గెలవడం కోసం రైతే రాజు అని మాటలు చెబుతారు రైతుని రాజులు చేయకపోయినా బాధ లేదు కానీ బికారిని మాత్రం చేయమాకండని అన్నారు. తక్షణమే కొత్తగూడెం మేజర్ కాలువకు సంబంధిత అధికారులతో నీటిని నడిపించి చెరువులు నింపితే గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్ల ద్వారా పొలాలు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నందున తక్షణమే నీటిని విడుదల చేసి చెరువుల నింపి నాణ్యమైన కరెంటును రైతులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెలకుర్తి పుల్లారావు, జల్లా కరుణ, బండ్ల నరేష్ నిరసన తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular