Thursday, September 10, 2026
[t4b-ticker]

పేదరికనికి చదువు అడ్డం కాదు.

పేదరికనికి చదువు అడ్డం కాదు.

:పట్టుదలే మనలో ఉంటే ప్రతి విజయం మన సొంతమవుతుంది అనడానికి డాక్టరేట్ నిదర్శనం.

:గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థికి డాక్టరేట్ వరించింది.

:డాక్టరేట్ అవార్డు గ్రహీతకు శివ కళ్యాణికిశుభాకాంక్షలు.
తెలియజేసిన గ్రామ ప్రజలు.

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 19(లోకం తీరు): మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన కాలతిరిపి పాపయ్య అంజమ్మ కుమార్తెకు డాక్టరేట్ అవార్డు అందుకోవడం జరిగినది. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన కాలతిరిపి శివ కళ్యాణి కోదాడలో డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ ఉస్మానియాలో ఎంఏ పిహెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ అవార్డును తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్యూల్ కులాలకు చెందిన నిరుపేద బాలిక మునుముందు అత్యున్నతమైన శిఖరాలు అందుకోవాలని పుట్టిన ఈ గ్రామానికి ఆమె సేవలు అందించాలని శివ కళ్యాణిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామములో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలు అవరోదించాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి గంగిరెడ్డి తులసమ్మ కన్నారెడ్డి, గ్రామపంచాయతీ కార్యవర్గం సభ్యులు, దేవాలయం వైస్ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular