ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డును అందుకున్న సలీం షరీఫ్
మూడు దశాబ్దాల అంకితభావానికి దక్కిన అరుదైన గౌరవం
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్) :విద్యా రంగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందిస్తూ, విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, సమాజ భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సలీం షరీఫ్ కు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులుగా మీదగా ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుల అవార్డును అందుకోవడం జరిగింది. సందర్భంగా సలీం షరీఫ్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. నాకు అవార్డు మరింత బాధ్యతను పెంచిందని ఈ సందర్భంగా అన్నారు.



