Sunday, October 11, 2026
[t4b-ticker]

పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

పట్టబద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

:అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి.

:మునగాల మండల కేంద్రంలో ఓటరు నమోదు అవగాహన సదస్సు*

:మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్):ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల మండల కేంద్రంలో మండల నాయకులతో కలిసి ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమవేశాన్ని ఉద్దేశించి బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని పట్టభద్రులకు వివరించి రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేలా చూడాలి. నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యా సమస్యలపై గళం వినిపించాలంటే అర్హులైన విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. నాయకులు అలసత్వం ప్రదర్శించకుండా గ్రామాలు, వార్డుల వారీగా తిరిగి అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేయించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. రాబోయే సాధారణ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ప్రామాణికం. కాబట్టి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి. ఉమ్మడి జిల్లాల పరిధిలో కోదాడ నియోజకవర్గం నుంచే అత్యధిక మెజారిటీ సాధించే దిశగా ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలనీ కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular