Sunday, October 11, 2026
[t4b-ticker]

క్రీడలలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలి

క్రీడలలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలి

:క్రీడలతో స్నేహబంధాలు ఏర్పడుతాయి.

:టీపీసీసీ డెలిగేట్ సభ్యుల చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి.

Mbmtelugunews// నడిగూడెం, అక్టోబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్)క్రీడలలో గెలుపు, ఓటములను క్రీడాకారులు సమానంగా తీసుకోవాలని టీపీసీసీ డెలిగేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ బాలుర పాఠశాలో ఏఎన్ఆర్ సౌజన్యం తో ఏర్పాటు చేసిన ఉత్తమ్ పద్మావతి ప్రీమియర్ క్రికెట్, జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ లీగ్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. క్రీడలతో క్రీడాకారులకు మానసిక,శారీరక,ఐక్యత ఏర్పడుతుందని అన్నారు. జాతీయ స్థాయి క్రీడలు ఒక గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించడం అభినందనీయం అన్నారు. క్రీడలలో పక్షపాతం లేకుండా నిపక్షపాతంగా నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిక్షపతి, నడిగూడెం సర్పంచి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ కవిత నాగరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లపు శ్రీనివాస్, ఏఎన్ఆర్ పౌండేషన్ చైర్మన్ నాగేందర్ రెడ్డి, బీసీ సంఘం డివిజన్ అధ్యక్షులు కాసాని శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు మీరాజుద్దీన్, పీడీ ప్రకాష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మూర్తి, నిర్వహకులు సతీష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular