పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుందాం.
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సానిటరీ వర్కర్స్ గత ఏడు రోజులుగా సమ్మె నిర్వహించి సాధించుకున్న జీతభత్యాల పెంపుదలను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు. కోదాడ ప్రభుత్వాసుపత్రిలో పనిచేయుచున్న కార్మికుల తో కలిసి సాధించుకున్న హక్కుల గురించి మాట్లాడారు సానిటరీ ఔట్సోర్సింగ్ పేషంట్ కేర్ సెక్యూరిటీ జీతాలను 2.243 రూపాయలు పెంపుదల చేసుకోవడం జరిగింది . అందులోనుండి పిఎఫ్ 1800 ఈఎస్ఐ కింద 152 రూపాయలు పోగా మిగిలిన 18.291 నెలసరి వారికి ఇవ్వాలని డిఎంఈ (డైరెక్టర్ మెడికల్ ఎన్ఫోర్స్మెంట్ )తో చర్చల సందర్భంగా ఒప్పందం జరిగిందని వారు పత్రిక తెలియజేశారు. ఈ జీతాలు తక్షణం అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు హాస్పటల్ సూపరిండెంటెంట్ దశరథ నాయక్ కి హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ నాగరాజు, బి బాలు, షేక్ రఫీ, ఓ వెంకమ్మ, జానయ్య, సరోజిని, శిరీష, జానమ్మ తదితరులు పాల్గొన్నారు.



