Friday, November 13, 2026
[t4b-ticker]

కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు.

: నూతన పెన్షన్లను మరిచిన గత ప్రభుత్వం

: మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 13(ప్రతినిధి మాతంగి సురేష్): గత పది ఏళ్ల లో అర్హులైన వారికి పింఛన్ ఇవ్వని బిఆర్ఎస్ ప్రభుత్వం
ఇప్పుడు మూడేళ్లకే అర్హులైన ప్రతి ఒక్కరి పెన్షన్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. స్థానిక ఆర్ఎస్పీ ఫంక్షన్ హాల్ లో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ పత్రాలు అందించడం జరిగింది. అనంతరం వేపూరి తిరుపతమ్మ సుధీర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు మర్చిపోరని రాబోయే రోజులలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వచ్చిన హామీలు కరెంటు, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్లు, విద్యార్థులకు మెనూ, రైతులకు రుణమాఫీ, 70000 ఉద్యోగాలు, హైడ్రా మూసి సుందరీ కరణ, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఒక్కటేమిటి కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. కోదాడ నియోజకవర్గం వేలకోట్ల రూపాయల నిధులతో ప్రజలకు అవసరమయ్యే పనులు చేయిస్తూ కోదాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న ఎమ్మెల్యే, మంత్రికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular