అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత చింతా బాబు మాదిగకు ఘన సన్మానం
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్) : స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత చింతా బాబు మాదిగకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చింతా బాబు మాదిగ అనేక యువజన కార్యక్రమాలను నిర్వహిస్తూ, యువతను సంఘటితం చేసి, వారిని బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ నాయకత్వంలో రిజర్వేషన్ల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడని ప్రశంసించారు.
సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తూ, యువతకు మార్గదర్శకంగా నిలిచిన చింతా బాబు మాదిగకు జాతీయ స్థాయి అవార్డు రావడం ఎంతో అభినందనీయమని, ఈ అవార్డు ఆయన సేవలకు తగిన గుర్తింపు అని నాయకులు హర్షం వ్యక్తం చేశారరు.

ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంపాటి పుల్లయ్య, తెలంగాణ ఉద్యమ నాయకులు గుండెపంగు రమేష్, 34వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు, కోదాడ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుడుముల రాంబాబు, అనంతగిరి మండల అధ్యక్షులు ఈ రాజేష్, సెక్రటరీ సామ్యూల్ కిరణ్, కోర్ కమిటీ సభ్యులు జాన్, చల్మయ్య, గోపి, కంపాటి శివాజీ, తమలపాకుల సైదులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



