పెన్షన్ విద్రోహ దినం విజయవంతం – పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
:టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు.
Mbmtelugunews//సూర్యాపేట, సెప్టెంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పింఛన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని నూతన పెన్షన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఒపీఎస్)ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు పెన్షన్ విద్రోహ దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ సూర్యాపేట జిల్లా బాధ్యులు దున్న శ్యామ్, సెక్రెటరీ జనరల్ ఎన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల నుండి పెన్షన్ కోసం జీవితాంతం సేవలు అందించిన అనంతరం వారి భవిష్యత్‌ను మార్కెట్ ఆధారిత పెన్షన్ విధానాలకు వదిలేయడం సమంజసం కాదని అన్నారు. ఉద్యోగులకు నిర్ధిష్టమైన, భద్రమైన పెన్షన్ అందించే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేందుకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం అత్యవసరమని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.
నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతపై అనిశ్చితి నెలకొంటుందని, అందువల్ల సిపిఎస్ ను పూర్తిగా రద్దు చేసి, 01-09-2024 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమింపబడి వారందరికీ పాత పెన్షన్ విధానం (ఒపీఎస్)ను పునరుద్ధరించాలి అని నాయకులు కోరారు. ఉద్యోగుల న్యాయమైన పెన్షన్ హక్కు సాధించే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీజీఈజేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు మట్టపల్లి రాధాకృష్ణ, ఎస్ రవికుమార్, నాయిని ఆకాష్ వర్మ, పాండు నాయక్, కొదిరెక్క నాగేందర్, పి కరుణాకర్ రెడ్డి, మన్నే యాదగిరి, మాడిపడగ సైదులు, డా, బట్టు గోపి, దర్శనం మల్లేష్, వేంకటరామ రెడ్డి, లక్ష్మయ్య, శ్యామ్ ప్రసాద్, అల్లి సతీష్, భూపతి వెంకటయ్య, నందిపాటి రవి, కోడి మురళి, బాడే లింగయ్య, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధ్యక్షులు, కార్యదర్శులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



