కోదాడ లో బంద్ ఎవరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం….
:కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 30 : చిరు వ్యాపారులు, సామాన్య జనం ఇబ్బందులు పడటం కోసమా ఈ బంద్ అని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు అన్నారు. కోదాడ లో ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నదుకా ఈ బంద్ అని అన్నారు. కోదాడ ఎమ్మెల్యే వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు చేస్తున్నాదుకా ఈ బంద్, ఎమ్మెల్యే నిజాయితీగా పని చేస్తున్నందుకా ఈ బంద్, గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, మునిసిపల్ పాలక వర్గం ఎవరి నియంతృత్వం లో లేకుండా స్వేచ్ఛగా వారి పనులు వారు చేస్తున్నాదుకా ఈ బంద్ అని అన్నారు. కోదాడ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు చుస్తునారు తస్మాత్ జాగ్రత్త అని అన్నారు.



