అమ్మ పాలు అమృతంతో సమానం
:ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికం.
:ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 04 (ప్రతినిధి మాతంగి సురేష్ ):
అమ్మ పాలు అమృతంతో సమానమని తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని ముర్రుపాల లోనే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని అది బిడ్డకు శ్రీరామరక్ష అని సర్పంచి రావుల భవాని వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో అంగనవాడి 1, 2 కేంద్రాలలో మంగళవారం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి రావుల భవాని వెంకటేశ్వర్లు, అంగన్వాడి సూపర్వైజర్ వీణ లు పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.

బిడ్డ పుట్టిన గంట లోపు వచ్చే మురుపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల బిడ్డ ను అనేక వ్యాధుల నుండి. రక్షిస్తాయని అన్నారు. కాన్పు జరిగిన గంటలోపే తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఇతర పానీయాలు ఏవి పట్టవద్దు అని తెలిపారు. ఆరు నెలలు నిండినటువంటి పిల్లలకి సిబిఈ ఈవెంట్లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 7-3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము ఎనిమిది గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలు, తల్లులు అంగన్వాడి టీచర్లు బుజ్జమ్మ, లలిత, ఆయా కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు .



