Saturday, August 15, 2026
[t4b-ticker]

స్వాతంత్ర సమరంలో మహనీయుల త్యాగలు మరువలేనివి: పద్మావతి

స్వాతంత్ర సమరంలో మహనీయుల త్యాగలు మరువలేనివి: పద్మావతి

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 15(ప్రతినిధి మాతంగి సురేష్) : దేశ స్వాతంత్రం కోసం జరిగిన సంగ్రామములో పోరాడి అమరులైన వీరుల త్యాగాలను దేశ ప్రజలు మరవకూడదని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుదీర్, వైస్ చైర్మన్ షేక్ బషీర్, మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పాల్గొని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మతో కలసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్పర్సన్ తిరుపతమ్మ తో కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ స్వతంత్రం ను అనుభవిస్తున్నామని అన్నారు. ఆ మహనీయుల త్యాగం మరువలేనిదని అన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సంఘ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మల్లేశ్వరి, డైరెక్టర్లు సూర్యం, వెంకటరెడ్డి, రాపాని శ్రీను, వీరబాబు, శ్రీనివాస్, మణెమ్మ, నాగవేణు, అమర్ సింగ్, పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular