తాగునీటి బావి పూడ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: హనుమంతరావు
Mbmtelugunews// కోదాడ, ఆగష్టు 24(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డ్ ఎస్టి బజారులో ఉన్న మంచినీటి బావిని గత రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు పూడ్చారని వారిపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని బావిని పునర్దించాలని కమ్యూనిస్టు పార్టీ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పూడ్చిన భావిని పరిశీలించిన అనంతరం మాట్లాడారు కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక నాలుగో వార్డులో 50 సంవత్సరాల క్రితం ప్రజల దాహార్తి తీర్చేందుకు 60 గజాల భూమిని కొనుగోలు చేసి మంచినీటి బావిని తీసినారు. ఆనాటి నుండి నేటి వరకు చుట్టుపక్కల ప్రజలు నిత్యవసర అవసరాలకు మంచినీటికి వాడుకుంటున్నారు. 60 గజాల స్థలాన్ని కొంత భాగాన్ని ఆక్రమించుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఉన్న బావిని పూడ్బిన వారిపై చర్యలు తీసుకొని బావి ప్రజల సౌకర్యార్థం బాగు చేయించాలని కోరారు. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని బావి పూడ్చిన వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మర సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్, కొండ కోటేశ్వరరావు, మాజీ సర్పంచి సుల్తాన్ కాటయ్య, మున్సిపల్ రెండో వార్డ్ కౌన్సిలర్ రాయపూడి కాటమరాజు, నిడిగొండ కనకయ్య, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, కాళేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.



