హర్గర్ తిరంగ్ యాత్రలో పాల్గొని దేశభక్తిని చాటుదాం…
:భాజపా ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ గ్రామాన హర్ ఘర్ తిరంగ్ యాత్ర
:జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు
Mbmtelugunews//అనంతగిరి, ఆగష్టు 14 (ప్రతినిధి మాతంగి సురేష్): హర్ ఘర్ తిరంగ్ యాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటాలని బిజెపి సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు అన్నారు.
శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు తిరంగ్ యాత్ర మండల ఇంచార్జ్ మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో గ్రామ గ్రామాన ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సంవత్సరం భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అదే సమయంలో వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ అభియాన్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాజపా మండల నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట నర్సయ్య, జిల్లా నాయకులు జిల్లా జనార్ధన్, మండల ప్రధాన కార్యదర్శి రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు జల్లా అరుణ, బొలిశెట్టి కృష్ణయ్య వరయ్య మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



