ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం, జూన్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): సర్ ప్రక్రియను ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తప్పులు తడకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని గ్రామ సర్పంచి గోసుల రాజేష్ అన్నారు. మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ ప్రక్రియను గోసుల రాజేష్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం (సర్)జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటర్ కు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి జూలై 24 లోగా ఫారంపై సంబంధిత ఓటరు పేరు,ఎపిక్ కార్డు సంఖ్య,చిరునామా,ఫోటో తదితర వివరాలతో తిరిగి సమర్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిపిఓ నారాయణరావు, బిఎల్ఓ సంకోజ సతీష్, ఆర్ఎంపి కొత్త ఉపేందర్, గ్రామ పెద్దలు సంకోజ జనార్ధన చారి తదితరులు పాల్గొన్నారు.



