డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రక్షణ పునరుద్ధరించాలి: కత్తి నాగబాబు
Mbmtelugunews//కోదాడ, జూన్ 25(ప్రతినిధి మాతంగి సురేష్) :ప్రజల పక్షాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ, మాజీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రక్షణ తొలగించడం బాధాకరమని కత్తి నాగబాబు అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాల ను పణంగా పెట్టి సేవలందించిన మాజీ అదనపు డీజీపీకి రక్షణ తొలగించడం ప్రభుత్వాల కక్షపూరిత వైఖరికి నిదర్శన మని ఆయన అన్నారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థిని మాలావత్ పూర్ణను ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే లా ప్రోత్సహించడం ద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని పేర్కొ న్నారు. అలాగే సాధన్పల్లి ఆనంద్ తో పాటు అనేక మంది విద్యార్థులు ఐఐటీలు, మెడిసిన్, ఇంజినీరింగ్, రక్షణ రంగాల్లో రాణించేలా మార్గనిర్దేశం చేశారని గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ద్వారా పలువురు విద్యార్థులు సైన్యం, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని వివరించారు. ఇలాంటి గొప్ప సేవలు చేసిన నాయకుడికి రక్షణ తొలగించడం సరైన చర్య కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పునరా లోచించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతను పునరుద్ధరించాలని కత్తి నాగబాబు డిమాండ్ చేశారు. ప్రజలు, విదా ర్థులు, మేధావులు, కార్మికులు, రైతుల ఆయనకు అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.



