ఘనంగా జగదీశ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Mbmtelugunews//కోదాడ, జులై 18(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని కొమరబండలో తెలంగాణ ఉద్యమ శిఖరం, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమనేత, కౌన్సిలర్ మామిడి రామారావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, వికలాంగులు, యువకులు పెద్ద యెత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బత్తుల వెంకన్న, మత్స్య శాఖ డైరెక్టర్ లు నాగులు, వీరబాబు, కిట్టు, మురళి, వీరబాబు, సీనియర్ నాయకులు సంపెట సీతయ్య, రామయ్య, మట్టయ్య, పైడిమర్రి వెంకన్న, బొల్లం మల్లయ్య, యువకులు రమేష్, జలందర్, అఖిల్, కార్తీక్, నాగరాజు, మున్నా, గణేష్ , ఖాజా తదితరులు పాల్గొన్నారు.



