Tuesday, September 1, 2026
[t4b-ticker]

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి…..

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి…..

:పీఆర్‌సీ, పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్……

:సీపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు…..

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్): ​సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం,తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఎన్జీవో కోదాడ అధ్యక్షులు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గడ్డం చిరంజీవి మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారిందని, తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీ నివేదికను అమల్లోకి తేవాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట నగేష్, ట్రెజరర్ మహేష్, నాయకులు పులి శ్రీను, పవన్, ముస్తఫా, విక్రమ్, చైతన్య, బంకా స్రవంతి తదితరులు పాల్గొన్నారు…..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular