సేవల్లో దేశంలోనే ప్రత్యేకం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల
:డా, పి పెంటయ్య సేవలు, అనితర సాద్యం
:మెరుగైన సేవలకు గాను మరింత సాయం అందిస్తాం.
:డా, బి బార్బుద్దే, జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం, డైరెక్టర్
Mbmtelugunews//కోదాడ, జూలై 23(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను సందర్శించిన జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం, డైరెక్టర్ డా, బి బార్భుద్దే. ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్య అందిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ సేవలను సవివరంగా తెలుసుకున్న డైరెక్టర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పశుపోషకులకోసం లాభసాటి పశుపోషణకు దాతల సహకారంతో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ ద్వారా అనతికాలంలోనే రైతులకు 15 కోట్ల పైన అదనపు సంపదను సృష్టించడం దేశంలోనే ఒక చరిత్ర అని, అందులోనూ పశుసంవర్ధక శాఖలో ఇలాంటి అద్భుతం ఎంతైనా అభినందనీయం అన్నారు. అంతేకాకుండా కోదాడ పట్టణమే కాకుండా జిల్లా నలుమూలల నుండి, ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రం నుండి వస్తున్న జంతువులు వాటికి నిర్వహిస్తున్న అత్యనంత కఠినమైన ఆపరేషన్లు చేస్తుంటే అబ్బురమేస్తుందని, రాష్ట్ర స్థాయిలో సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలలో పది మంది స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా అందించే సేవలు ఒక్కడే అందులోనూ కనీస వసతులు లేని కోదాడ పశువైద్యశాలలో కావలసిన వసతులు పనిముట్లు సమకూర్చుకుంటూ ఎంతటి ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తూ పశువుల ప్రాణ రక్షణ, యజమానుల సంక్షేమం కోసం వృత్తిని ప్రేమిస్తూ అంకితభావంతో అందిస్తున్న సేవలు దేశంలో అందరికీ ఆదర్శనీయం అన్నారు. అనంతరం రైతుల కోసం పశుగ్రాస బ్యాంక్ ఏర్పాటుకు నిధుల మంజూరీకై అసిస్టెంట్ డైరెక్టర్ విన్నవించగా ఆసక్తి గల ఎస్సి, ఎస్టి రైతులను గుర్తిస్తే నిధులు మంజూరీ చేస్తామని అలాగే రైతులకు అవగాహనా శిబిరాలకు, ఎంపిక చేయబడిన గ్రామం లో పశుపోషణ తో గ్రామాభివృద్ధి వృద్ధికి మొత్తం గ్రామ కుటుంబాలకు సైతం అవసరమగు నిధులతో సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాల నుండి ఔషధాలకోసం వచ్చిన గొర్రెలపెంపకం దారులతో ముచ్చటించి వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి పశు ఔషధ బ్యాంక్ లో మందులు తీసుకెళ్లడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా బోడేపూడి శ్రీనివాసరావు, జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం హైదరాబాద్ ప్రిన్సిపాల్ సైంటిస్టులు డా, పి బస్వారెడ్డి, డా, దీపక్ రావుల్, అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది పోటు వెంకటేశ్వర రావు, శేషగిరి, సాయికృష్ణ, చిరంజీవి, బడేటి శివ, చంద్రకళ, కర్ణ పాల్గొన్నారు.



