పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గా కొండా వెంకటేశ్వర్లు..
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్):హైదరాబాద్ లో జరిగిన పిఆర్టియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గా కోదాడ కి చెందిన కొండా వెంకటేశ్వర్లు ని ఎన్నికున్నారు.ఈ సందర్బంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.అదేవిదంగా తన ఎన్నికకు సహకరించిన జిల్లా అద్యక్ష,ప్రధాన కార్యదర్శులు తంగెల్ల జితేంద్రరెడ్డి,తీగల నరేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొంగరీ లక్ష్మి నారాయణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.