Friday, July 4, 2025
[t4b-ticker]

రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది:

రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది:

చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్.

రాజ్యాంగం మార్చాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి

:కాంగ్రెస్ మండల అధ్యక్షుడు.

బూత్కూరి వెంకటరెడ్డి.

Mbmtelugunews//కోదాడ, మే 07(ప్రతినిధి మాతంగి సురేష్):భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికి అందే విధంగా రాజ్యాంగాన్ని కాపాడా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుదీర్ అన్నారు.బుధవారం మండలంలోని
వల్లాపురంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
బూత్కూరి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్యహించిన జై బాపు,జై బీమ్,జై సంవినాద్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు.మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో,భారత రాజ్యాంగ రచన సమయంలో ఊసేలేని బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదన్నారు.భారత రాజ్యాంగాన్ని మార్చాలని చేస్తున్న బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.వల్లాపూరం,సిరిపురం, నారాయణపురం,కాగిత రామచంద్రపురం,కరివిరాల,పెరకగూడెం,కేశవాపురం,వేణుగోపాలపురం,బృందావనపురం గ్రామాలలో జై బాపూ,జై భీమ్,జై సంవిధాన్ కార్యక్రమం పురస్కరించుకొని,పాదయాత్ర నిర్వహించి,భారత రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కెఆర్సి పురం పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్,వల్లపురెడ్డి సురేందర్ రెడ్డి,దున్నా శ్రీనివాస్,పల్లా వెంకటరెడ్డి, దేవబత్తిని రమేష్,ప్రసాద్,మొక్కా బిక్షపతి,శెట్టి సతీష్,గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్,గుజ్జా అంజి,పాతకోట్ల నాగేశ్వరరావు,మీడిదొడ్డి శ్రీను,నాగిరెడ్డి వీరారెడ్డి, వెంకటరెడ్డి,నాగిరెడ్డి లింగారెడ్డి,అలుగుబెల్లి చంద్రశేఖర్ రెడ్డి,అలుగుబెల్లి గురువారెడ్డి,బంధారపు మల్లిఖార్జున్,వెంకట రెడ్డి,పాలడుగు ప్రసాద్,అర్జున్ రావు,సుబ్బారావు,పేరెల్లి కోటి,అంజి,వేల్పుల సోమయ్య,కొల్లు నరసింహరావు,దాసరి రవి,పుట్టా రమేష్,రేపాల పురుషోత్తం,బొడ్డు గోవర్ధన్,పుట్టా చంద్రయ్య,కంభంపాటి చైతన్య,చిరంజీవి,కంభంపాటి శ్రీను,మాతంగి మాధవరావు,అంజయ్య,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నలమాద వీరబాబు,వెంకట్ రెడ్డి,నడిగూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లపు గోపాల్,ఆయా గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular