సిపిఐ మండల కార్యదర్శిగా హనుమంతరావు ఎన్నిక
:సహాయకార్యదర్శిగా రాజేశ్వరరావు.
Mbmtelugunews//కోదాడ,మే 29(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో పోతురాజు సత్యనారాయణ అధ్యక్షతన గురువారం నాలుగవ సిపిఐ మండల మహాసభను నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శిగా బత్తినేని హనుమంతరావు సహాయ కార్యదర్శిగా పోతురాజు రాజేశ్వరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర,జిల్లా,మండల,పట్టణ ,గ్రామాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.కోదాడ మండలంలో కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి నాయకుల పూర్తి సహాయ సహకారాలతో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.వీరితోపాటు ఏడుగురు సభ్యుల మండల కార్యవర్గం బత్తినేని హనుమంతరావు,పోతురాజు రాజేశ్వరరావు,బొల్లు ప్రసాదు,మాతంగి ప్రసాదు,కొండా కోటేశ్వరరావు,కంబాల స్వామి,పస్తం సుందరయ్య,గోసు నగేష్,మధ్యానపు హైమావతి,ఆహ్వాన కమిటీ సభ్యులుగా గొట్టెముక్కల కోటి నారాయణ,పోతురాజు సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.