సాయిబాబా గుడిలో పూజలు, అన్నదానం
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 21 (ప్రతినిధి మాతంగి సురేష్) మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు, అర్చకుడు సాయి శర్మ, దాతలు కమదన యాదగిరిరావు, కమదన శ్రీ సరస్వతి, కమదన సాయి శరణ్య, కమదన శ్రీనివాసరావు, రంగారావు, శరభయ్య, భక్తులు పాల్గొన్నారు.



