స్వేరోస్ డే సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 22( ప్రతినిధి మాతంగి సురేష్ ): గురుకులాల రూపకర్త కీర్తిశేషులు ఎస్సార్ శంకరన్ జన్మదిన సందర్భంగా స్వేరోస్ ఈ దినాన్ని స్వేరోస్ డే గా జరుపుకుంటారు..ఈ సందర్భంగా సుప్రీం స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య సూచనతో మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో రోడ్ల వెంట పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి రోడ్లను శుభ్రం చేసే క్లీన్ అండ్ గ్రీన్ ను చేపట్టారు. అనంతరం స్వేరోస్ రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్ మాట్లాడుతూ 2012 అక్టోబర్ 22న ఏర్పడిన స్వేరోస్ నెట్వర్క్ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నినాదంతో పనిచేస్తుందని తెలిపారు..అలాగే గురుకులాలను ఏర్పాటు చేయడం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు చక్కటి వసతితోపాటు నాణ్యమైన విద్య భోజనం అందించడానికి కారణమైన ఎస్ఆర్ శంకరన్ కి స్వేరోస్ నాయకులు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.



