ఎడతెరపు లేని వర్షానికి నీట మునిగిన పంట పొలం
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 30(ప్రతినిధి మాతంగి సురేష్):గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన చెడపంగు వెంకటేశ్వర్లు కౌలు రైతు పది ఎకరాలు పూర్తిగా నీటిమనగటంతో దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.ఈ సందర్భంగా కౌలు రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.అప్పు చేసి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడితే చేతికొచ్చిన పంట మొత్తం మొంథా తుఫాన్ తాకిడికి పది ఎకరాల వరిచేను నేలపాలైందని వాపోయారు.తనలాంటి కౌలు రైతులందరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తగిన నష్టపరిహారాన్ని అందజేయాలని సందర్భంగా కోరారు.



