Sunday, February 8, 2026
[t4b-ticker]

జాతీయ విద్యా దినోత్సవం..

జాతీయ విద్యా దినోత్సవం..

:విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలి….

:రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు….

:ఎంఈఓ ఎండి సలీం షరీఫ్.

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడలో మంగళవారం స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు. భారత విద్యారంగానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన విశేష కృషిని కొనియాడినారు.
అనంతరం సూర్యాపేట జిల్లా స్థాయిలో జరిగిన యువజన జానపద నృత్య సైన్స్ పోటీలలో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమొంటోలని అందజేసి విద్యార్థులకు గైడ్ టీచర్స్ దేవరాజ్, అశోక్ గౌడుల కు అభినందనలు తెలియజేసినారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. జిల్లాస్థాయి జానపద నృత్య పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాల విద్యార్థులు మదీనా, అనహ , సమ్రీన్, మైమోనా, ఆయేషా, లాస్య, ప్రవల్లిక, జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు, సైన్స్ మేళాలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన పాఠశాల విద్యార్థులు రిషిద్, రిషి, నవదీప్, విద్యార్థులకు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ, ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందనలు తెలియజేసినారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular