ఘనంగా ఎర్నేని వెంకటరత్నం బాబు 75 వ పుట్టినరోజు వేడుకలు.
Mbmtelugunews//కోదాడ, నవంబర్20(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు 75 వ పుట్టిన రోజు వేడుకలను కోదాడ పట్టణంలోని అయన నివాసంలో గురువారం ఘనంగా నిర్వహించారు.అయన అభిమానులు వెంకటరత్నం బాబును శాలువాల తో సన్మానించి వారి సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది.అనంతరం కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నా పుట్టిన రోజుకి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, కోదాడ మండల ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు నలజాల శ్రీనివాసరావు, నంబూరి సూర్యం, మాజీ కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు, తీపిరిశెట్టి రాజు, కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, ఖాజా, కర్రి శివ సుబ్బారావు, నేమ్మాది దేవమణి ప్రకాష్, కారింగుల అంజన్న గౌడ్, పిల్లుట్ల శ్రీనివాస్, గంధం పాండు, మేకపోతుల సత్యనారాయణ గౌడ్, మల్లెల బ్రహ్మయ్య, మందలపు శేషు, అల్తాఫ్ హుస్సేన్, బాయ్ జాన్, రావేళ్ళ కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్, లైటింగ్ ప్రసాద్, వేమూరి విద్యాసాగర్ తదితర కార్యకర్తలు, నాయకులు పెద్దలు, యువకులు, మహిళ అభిమానులు పాల్గొన్నారు.



