సంస్కృతాంధ్రోషన్యాసకులు శ్రీమాన్ ముడుంబై లక్ష్మణాచార్యులు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 04( ప్రతినిధి మాతంగి సురేష్): ధనుర్మాసోత్సవాలు.
కలియుగ ప్రత్యక్ష దైవం ఐన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహముతో తిరుమల తిరుపతి దేవస్థానము వారి” ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్”వారి ఆధ్వర్యములో, మన కోదాడ పట్టణములో అనంతగిరి రోడ్డు నందు స్వయం వ్యక్తముగా వేంచేసియున్న శ్రీ గుంటిరఘునాథస్వామి వారి దేవాలయంలో ది.16/12/2025 మంగళవారం నుండి ది.14/1/2026బుధవారం వరకు నెలరోజుల పాటు “ధనుర్మాస పూర్వక” “తిరుప్పావై”మహోత్సవ ప్రవచనాలు జరుగుతాయి.ప్రవచనాలు చేయుటకై భాషా
పండితులు, సంస్కృతాంధ్రోషన్యాసకులు ఐనట్టి శ్రీమాన్ ముడుంబై లక్ష్మణాచార్యులుకి ఈసంవత్సరం కూడ సదవకాశం కలిగింది.ప్రతిరోజు ఉదయము 8గంటలకు ప్రవచనం ఉంటుంది.కావున భక్తులెల్లరు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అశేష సంఖ్యలో పాల్గొని తరించగలరు.



