గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
:పాలకవర్గంతో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా: బాబ్జి
Mbmtelugunews,//కోదాడ, డిసెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని మంగళ తండా గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బి బాబ్జి గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ప్రజలు పాలకవర్గంతో చర్చించి అభివృద్ధికి బాటలు వేస్తానని తెలిపారు డిసెంబర్ 22వ తారీకు జరిగే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారని పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రమాణ స్వీకారం రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.



