క్రిస్మస్ పర్వదినం క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలి.
:క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
:కోదాడ నయన్ నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు క్యాలెండర్ ఆవిష్కరణ.
క్రిస్మస్ పర్వదినం క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోదాడ టిపిసిసి డెలికేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. బుధవారం కోదాడ బాప్టిస్ట్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు.

సమాజంలో శాంతి సామరస్యాలు క్రైస్తవుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్న పాస్టర్ యేసయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కాప్షన్ సభ్యురాలు జానకి యేసయ్య, చర్చి పాస్టర్ యేసయ్య, గిరిజన ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు బానోతు జగ్గు నాయక్, రిటైర్డ్ సిఐ శ్యామ్, మోజెస్, స్టీఫెన్, శారా, కిషన్ శ్రీనివాసచారి,యునోస్, తిమోతి తదితరులు పాల్గొన్నారు.



