Sunday, February 8, 2026
[t4b-ticker]

సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మ హిళా విద్య అభివృద్ధికి కృషి చేయాలి: జానకి యేసయ్య

సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మ హిళా విద్య అభివృద్ధికి కృషి చేయాలి: జానకి యేసయ్య

Mbmtelugunews//కోదాడ, జనవరి 03(ప్రతినిధి మాతంగి సురేష్): సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళా విద్య అభివృద్ధికి కృషి చేయలని కోదాడ మున్సిపల్ మాజీ క్రిస్టియన్ మైనారిటీ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి యేసయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పట్టణంలోని స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో యునైటెడ్ పాస్టర్స్ నియోజకవర్గ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జానకి యేసయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశంలోని మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే త్యాగం మరువలేనిదని ఆమె తెలిపారు. విద్యను ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడిన ఆమె జీవితం దేశ మహిళలందరికీ మార్గదర్శకమైనదని తెలిపారు. విద్య ద్వారానే మహిళలు బలహీనవర్గాలు స్వాలంబన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నేటి విద్యావంతులైన మహిళలు సామాజిక రుద్రాల నిర్మూలనకై కృషి చేయాలని ఆమె తెలిపారు. విద్యావంతులైన మహిళలు నిరక్షరాశులకు విద్యను నేర్పి విద్యావంతులు చేసినట్లయితే ఆమెకు మనం ఇచ్చే ఘన నివాళులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్, బొలికొండ కోటయ్య, మేరాబి, మరియమ్మ, శ్రావ్య, చిన్న సైదులు, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular