స్త్రీ విద్యకు వెలుగు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే:సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య
Mbmtelugunews//కోదాడ, జనవరి 03( ప్రతినిధి మాతంగి సురేష్ ): స్త్రీ విద్యకు వెలుగు నింపిన మహనీయురాలిని స్మరించుకుంటూ,
ఆమె చూపిన మార్గంలో నడుస్తూ
విద్య ద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దాలని సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య. శనివారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పాల్గొని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలులు, అంగన్వాడీ టీచర్ లకు, ఉపాధ్యాయులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి,
ఆరోగ్య సేవల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్ వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ
సమాజానికి సేవ చేసే మీ అందరికీ
హృదయపూర్వక అభినందనలు మీ సేవలు ఎప్పటికీ గ్రామానికి ఆదర్శంగా నిలవాలనీ ఆశిస్తూ మీకు గణపవరం గ్రామం ప్రజలకు చదువుల తల్లి సావిత్రి బాయ్ ఫూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర శెట్టి కోటేశ్వరరావు, పాలక వర్గం ,గ్రామ పెద్దలు, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.



