ప్రవచనాలు విని అభినందనలు తెలిపిన వంశికృష్ణమాచార్యులు
Mbmtelugunews//కోదాడ, జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్): రంగనిగుడి లో జరుగుతున్న ధనుర్మాసోత్సవ పూర్వక ప్రవచనాలను గూర్చి తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారు పరిశీలించడం జరిగింది.పరిశీలకులు శ్రీమాన్ భాగవతుల వంశీకృష్ణమాచార్యులు ఉదయం7గంటలకే విచ్చేసి తిరుప్పావై సేవా కాలంలో పాల్గొని, అనంతరం శ్రీమాన్ ముడుంబైలక్ష్మణాచార్యలు చెప్పిన ప్రవచనంను విని ఆనందించి ప్రశంసించారు. ఈ నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో విశేషం సంఖ్యలో భక్తులు, ఆలయార్చకులు, ఈవో, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.



