Sunday, February 8, 2026
[t4b-ticker]

అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఇరుముడి మహోత్సవం

అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఇరుముడి మహోత్సవం

:ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్నేని వెంకటరత్నం బాబు.

Mbmtelugunews//కోదాడ, జనవరి 06( ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణ పరధిలోని శ్రీరంగపురం అభయాంజనేయ స్వామి దేవాలయంలో కమిటీ సభ్యుడు కుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని వెంకటరత్నం బాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇరుముడిని స్వామివారికి సమర్పించి భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కుర్రి గోపయ్య, గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు వెంకటరెడ్డి జెసిబి, జై హనుమాన్ ఇండస్ట్రీస్ అధినేత బొలిశెట్టి రాము, దేవాలయ వైస్ చైర్మన్ చిత్తలూరు వెంకటేశ్వర్లు, మల్లు నాగిరెడ్డి, మల్లు రోహిత్ రెడ్డి, సిరంశెట్టి వెంకటేశ్వర్లు, మల్లెబోయిన శ్రీనివాస్, బోడ శివలింగయ్య, అవిరే వెంకటేశ్వర్లు, శంకర్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular