ఘనంగా కోదాడ నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య జన్మదిన వేడుకలు
:యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ.
Mbmtelugunews//కోదాడ, జనవరి 09(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్, కోదాడ నియోజక వర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ డా యేస్యయ్య జన్మదిన వేడుకలు అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మంచి ఆయురారోగ్యలతో ఇంకా ఘనమైనా సేవ చేయాలని దీవించారు. తదుపరి కేక్ కట్ చేసి శాలువలతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో కోదాడ మాజీ క్రిస్టియన్ కో అప్షన్ సభ్యులు వంటెపాక జానకి యేసయ్య, అసోసియేషన్ నియోజక సెక్రటరీ రాజేష్, పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్, ప్రభాకర్, కిరణ్, హైరిగోమ్స్, శాంత వర్డన్, సామ్యూల్ కిరణ్, సుధారాణి, ప్రమీల, మీరేబి, ఎల్చిమ్మ తదితరులు పాల్గొన్నారు.



