ఖబర్దార్ ప్రీతం నీ వైఖరి మార్చుకోవాలి
:మంద కృష్ణ మాదిగ అన్ననీ విమర్శించే స్థాయి నీదా?
:మాదిగలను మోసం చేసిన ఏ పార్టీ కూడా బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు
:ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినావంటే ఎవరీ కృషి.
:జాతిని తాకట్టుపెట్టి రెడ్లకు ఊడిగం చేస్తున్నావా!
:నీ వైఖరి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటాం.
:మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ.
Mbmtelugunews//కోదాడ, మర్చి 08(ప్రతినిధి మాతంగి సురేష్): ఖబర్దార్ ప్రీతం మంద కృష్ణ మాదిగ అన్ననే విమర్శించే స్థాయి నీదా నీ వైఖరి మార్చుకోని మందకృష్ణ మాదిగ అన్నకి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటామని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ అన్నారు. ఈ సందర్బంగా నవీన్ కుమార్ మాదిగ మాట్లాడుతూ ప్రీతం అన్న మందకృష్ణ మాదిగ అన్నను విమర్శించే స్థాయి మీదా జాతిని తాకట్టు పెట్టి రెడ్లకు ఊడిగం చేస్తున్నావా నీవు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో కూర్చున్నావంటే అది ఎవరి కృషి పట్టుదలో నీకు తెలియదా అని అన్నారు. మందకృష్ణ మాదిగ అన్నకు క్షమాపణ చెప్పకపోతే మీ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు.



