కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాబివృద్ధి పై శిక్షణ
Mbmtelugunews//కోదాడ, మర్చి 11(ప్రతినిధి మాతంగి సురేష్): కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ( టాస్క్ ) ఆధ్వర్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రెండవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు భాను ప్రదీప్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులలో విద్యార్థి నులకు పైథాన్ ప్రోగ్రాం మీద అవగాహనా కల్పించారు.ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచం లో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.



