జిల్లాలో పశువైద్య సేవల బలోపేతానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు… జిల్లా కలెక్టర్
Mbmtelugunews//సూర్యాపేట, మార్చి 26(ప్రతినిధి మాతంగి సురేష్ ): చికిత్స కన్నా నివారణ మేలన్న సామెత అనుసరించి పశువైద్యం ప్రజావైద్యం కన్నా ప్రాముఖ్యం అని జిల్లాలో పశువైద్యసేవలు అభినందనీయం అని కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన పశువాద్యాధికారుల సమావేశం లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రశంసించారు. పశు ఆరోగ్యం, జాతి అభివృద్ధికి కృత్రిమ గర్భధారణ, ఆడదూడల కోసం లింగవిభజన వీర్యం వాడకం, వ్యాధుల నివారణకు టీకాలు మొదలు వినూత్నంగా పిచ్చుక, పక్షులు, ఉడుత,పిల్లి కుక్క,కోతి కొండెంగ బాతు కోడి నుండి గొర్రె మేక ఆవులు గేదెల వరకు సమస్త జంతువులకు అత్యవసర వైద్యంతో పాటు ఆపరేషన్లు విరిగిన కాళ్ళకు రాడ్లు వేయడం, ఆర్థోపెడిక్ సర్జన్ల సహకారం తో కుక్కలకు వెన్నెముక ఆపరేషన్స్, సీపీఆర్, అంటూ అన్ని రకాల వైద్య సేవలతో పాటు, డెంటల్, ఆప్తాల్మిక్, క్రిటికల్ కేర్ తోపాటు ఈ మధ్య ఆంధ్రాలో కోడి పందాల్లో కాళ్ళు రెక్కలు విరిగి గాయాలైన పందెం కోళ్లకు కూడా మనజిల్లాలో వైద్యం అందించడం సంతోషంగా ఉందన్నారు. శాఖ లక్ష్యాల పురోగతి సమీక్షించిన కలెక్టర్ నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించిన శాఖ పశుసంవర్ధక శాఖ అని జిల్లాలో మరింతమెరుగైన సేవలతో పశుపోషకుల ఆదాయమార్గాలను పెంచడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అవసరాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. వివిధ మండలాల పశువైద్యులు అభ్యర్థించిన అభ్యర్థనలను సావదానంగా ఆలకించిన కలెక్టర్, జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ప్రజా సమాచారం కోసం పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ఏర్పాటు, శౌచాలయాల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, ఆపరేషన్ పరికరాలకిట్లు, పశుపోషకుల పెట్టుబడి ఖర్చు తగ్గించి పాడి లాభాల బాటలో నడపడానికి రివాల్వింగ్ ఫండ్ తో ఖనిజ లవణ మిశ్రమం, కాల్షియం, ఇతర పశుపోషకాలు, పశువైద్య యూనివర్సిటీ నుండి పశువుల దాణా తదితరాలు అందించడానికి, మున్సిపాలిటీ పట్టణాల్లో వ్యాధిసోకిన పశువులను ఆసుపత్రికి తీసుకువచ్చి మరలా ఇంటి వద్ద దింపడానికి హైడ్రాలిక్ అంబులెన్స్ ల ఏర్పాటు, తో రైతులకు చేయూత, పశుపోషణపై కాలానుగుణ యాజమాన్య మెలకువలపై శిక్షణలు, ప్రతీ నియోజక వర్గానికి క్రిటికల్ ఆపరేషన్లకోసం ఆర్థోపెడిక్ సర్జరీ పరికరాల కిట్టు ఏర్పాటు చేస్తామని అన్నారు.

జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని పశుగ్రాసం కొరత తీర్చడానికి కావలసినంత పశుగ్రాస విత్తనాలు అందిస్తామని, ఆసక్తి గల సమభావన సంఘాలతో పశుగ్రాసాలు పెంచి జిల్లాలో పశుగ్రాస బ్యాంక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కోదాడ లో దాతల సహకారంతో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు తో అనతికాలంలో పశుపోషకులకు కోట్ల రూపాయల అదనపు సంపద సృష్టించడం అభినందనీయమని జిల్లాలో ఇదే తరహాలో ఇతర పశువైద్యశాలల్లో పశు ఔషధ బ్యాంక్ ల ఏర్పాటుకు కృషి చేయాలి అన్నారు. దొడ్లో పుట్టే దూడాలన్నీ ఆడదూడలే కావాలంటే లింగ విభజన వీర్యం ఒక్కటే మార్గమని దీని ఖరీదు ఎక్కువగా ఉండడంతో రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారని జిల్లాలో ఒక సీజన్ మొత్తం అన్ని పశువులకు ఈ వీర్యాన్ని ఉచితంగా ఇవ్వడానికి నిధులు ఇస్తానని ఈ సారి జిల్లాలో అన్ని పడ్డ దూడలే జన్మించాలని సూచించారు. జిల్లాలో 55 ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని అడిగిన జిల్లా అధికారికి ఆ పోస్టు లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
కోదాడ, చిలుకూరు ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్ కలర్ డాప్లర్ స్కానింగ్ యంత్రాలకు నిధులు ఇచ్చామని 50 పశువైద్య శిబిరాలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులకు కుర్చీ టేబుల్స్, ఉపాధిహామీలో పశువులకొట్టాల మంజూరీ తక్షణమే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కరెంట్ బిల్లుల సమస్యతో ఆసుపత్రులకు కరెంట్ నిలిపి వేసే విషయాన్ని పశువైద్యులు తెలుపగా వెంటనే విద్యుత్ యస్ ఈ కి ఫోన్ ద్వారా ఎట్టి పరిస్థితిలో వైద్యశాలల కరెంట్ నిలుపరాదని ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన హామీలను త్వరగా అమలుపరచడానికి తరితగతిన ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారిని ఆదేశించారు. దశాబ్దాలుగా శాఖలో ఉన్న సమస్యలను చెప్పినా శాఖ ద్వారా పరిష్కారం కాకపోగా ఒకే ఒక్క సమావేశంతో సకల సమస్యలను ఉన్న పలాన పరిష్కరిస్తూ నిధులిచ్చి మిగిలిన వాటికి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారి ని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డైనమిజాన్ని రైతులకోసం తాపత్రయాన్ని శాఖ మీద ప్రమకి సంభ్రమాత్సర్యాలతో కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపిన పశువైద్యులు. సమాజంలో నూటికి 98.7 శాతం ప్రజలు పశు ఉత్పత్తులైన పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తీసుకుంటున్నారని, వారంతా ఆరోగ్యంగా ఉండాలంటే పశువైద్యం పటిష్టంగా ఉండాలని మీరు పనిచేయడానికి శాఖల సౌకర్యాలు నేను ఇస్తాను ప్రజలకోసం మీరు పని చేయండి, ఇకనుండి ఆక్స్మిక తనికీలు కూడా చేస్తానని అందరూ అంకిత భావంతో పని చేసి పశు ఆరోగ్యంతో పశుపోషకుల ఆదాయం పెంచి జిల్లాకి మంచి పేరు తేవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పశు వైద్య మరియు పశుసంవ అధికారి డా బి శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ లు, డా వెంకన్న, డా పి పెంటయ్య , డా సత్యనారాయణ, డా బి వి ప్రసాద్ , పశువైద్యులు పాల్గొన్నారు.



