Friday, March 27, 2026
[t4b-ticker]

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి…

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి…

:కళ్యాణం… కమనీయం…. రమణీయం…

:గోపిరెడ్డి నగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం….

Mbmtelugunews//కోదాడ, మార్చి 27(ప్రతినిధి మాతంగి సురేష్): శ్రీ సీతారాముల ఆశీస్సులతో కోదాడ పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవంలో వారి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో శాంతి సామరస్యాలు పెంపొందుతాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించి ధన్యులం అయ్యాం అన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ దర్శన భాగ్యం కల్పించిన గోపి రెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. పట్టణ ప్రజలకు శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, 6వ కౌన్సిలర్ నాగేంద్రమ్మ, 14వ వార్డు కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, 19 వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ గుండపునేని పద్మ, గోపిరెడ్డి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular