సివిల్ రైట్స్ డే సందర్భంగా అవగాహన
Mbmtelugunews//కోదాడ, మార్చి 30(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కాపుగల్లు గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావు గౌడ్, రిపబ్లిక్ అండ్ సీనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా బోసు బాబు ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ రైట్స్ డే సందర్భంగా గ్రామంలో కుల వివక్షకు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అలాంటి ఏవైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని అవగాహన కల్పించారు. అనంతరం రిపబ్లిక్ అండ్ సీనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా బోసు బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కొనియాడారు. ఢిల్లీ ( ముంబాయి )లో జరగబోయే అంబేద్కర్ ఉత్సవాలను అంబేద్కర్ అభిమానులు ప్రజలు తిలకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ జగదీష్, పంచాయతీ సెక్రటరీ వెంకట్ నారాయణ, జిపిఓ నాగుల్ మీరా, స్థానిక నాయకులు ఓర్సు గోపి, జిల్లా నాయకులు గుడివైన శ్రీనివాసరావు, గణపవరపు శ్రీనివాసరావు, చారి, ఉదర బాబురావు, నూకపంగు మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



