క్రీస్తు త్యాగం మరువలేనిది
:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Mbmtelugunews//హైదరాబాద్, ఏప్రిల్ 03: గుడ్ ఫ్రైడే సందర్భంగా…
యేసు క్రీస్తు త్యాగం, ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
యేసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.



