Monday, April 6, 2026
[t4b-ticker]

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

: సర్పంచి పాలకు సురేష్

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 06( ప్రతినిధి మాతంగి సురేష్): ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచి పాలకి సురేష్ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్ నందు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఇంగ్లీష్ మీడియం లో విద్య ను అందిస్తున్నారు కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాక సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నారని అన్నారు. విద్యార్థులను గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డ్ మెంబర్ వనపర్తి పిచ్చయ్య, వెంకటేశ్వర్లు, హెడ్మాస్టర్ కృష్ణ, అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular