సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:
మేళ్లచెరువు ఏప్రిల్ర్ 8/mbmtelugunews.com//వాహనం ఢీకొని ఇద్దరు మృతి, 10 మందికి గాయాలుసూర్యాపేట (చివ్వెంల): మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్న భక్తుల వాహనాన్ని అతివేగంగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లవాపురం రెవెన్యూ పరిధిలోని శ్రీ ఏచర్ల ముత్యాలమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది.ఘటన వివరాలు:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలానికి చెందిన జనిగ నరసింహారావు కుటుంబ సభ్యులు, బంధువులు (సుమారు 20 మంది) కలిసి బొలెరో వాహనంలో (TS29T 7150) దురాజ్ పల్లి లింగమంతుల స్వామి మొక్కులు చెల్లించుకోవడానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఏచర్ల ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద కొబ్బరికాయ కొట్టి, మొక్కులు తీర్చుకున్న అనంతరం తిరిగి దురాజ్ పల్లి వైపు ప్రయాణమయ్యారు.ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వెనుక నుండి అతివేగంగా వచ్చిన ఐచర్ డిసిఎం (MP13 GB5716) వాహనం బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్న వారిలో 10 మందికి గాయాలవ్వగా, ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.మృతుల వివరాలు:జనిగ సతీష్ (25): తండ్రి శ్రీను, మేళ్లచెరువు గ్రామం. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.జనిగ నరసింహారావు (37): తండ్రి చంద్రయ్య, మేళ్లచెరువు గ్రామం. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.మిగిలిన గాయపడిన వారు ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



